రేపు ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సేవలు బంద్ కానున్నాయి. కోల్ కత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ , పారామెడికల్ స్టాఫ్, మొత్తం వైద్య సిబ్బంది నిరసనలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపిచేసారు ప్రభుత్వ వైద్యులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూ.డా లు OP సేవలను బహిష్కరించారు.
ఇటు అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా OP, తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్ కత్తా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. రేపు రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా… అన్ని సేవలు బహిష్కరించి ధర్నా చౌక్ వద్ద ఆందోళకు దిగనున్నారు వైద్యులు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్యులను కదిలిస్తున్నాయి వైద్య సంఘాలు.