కేటీఆర్ కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు

-

ఇటీవలే తెలంగాణ మహిళా కమిషన్ జ్యోతిష్యుడు వేణు స్వామికి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు పంపించింది తెలంగాణ మహిళా కమిషన్. ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బస్సుల్లో అల్లం, వెల్లిపాయాలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడడం లేదా? అని ప్రశ్నించారు.  బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్స్‌లు వేసుకోమనండి.. మాకేంటి’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం పై పలువురు కాంగ్రెస్ మహిళా నేతలు విమర్శించారు. మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా కేటీఆర్ కి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 24, 2024న మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హాజరుకావాలని ఆదేశించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version