రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం, తులసి హెర్బల్‌ టీ..!

-

అసలే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీనికి తోడు వర్షాకాలం వచ్చేసింది. ఇక ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా విషజ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు వ్యాపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన సమయంలో మనం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఆయా వ్యాధులు రాకుండా ఉండేందుకు గాను ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీనికి తోడు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటే జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను కింద సూచించిన హెర్బల్‌ టీని తయారు చేసుకుని నిత్యం సేవించాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ హెర్బల్‌ టీని ఎలా తయారు చేయాలంటే…

immunity boosting ginger and tulasi herbal tea

హెర్బల్‌ టీని తయారు చేసేందుకు కావల్సిన పదార్ధాలు…

* అల్లం – కొద్దిగా
* తులసి ఆకులు – 4, 5
* సోంపు గింజలు – అర టీస్పూన్‌
* జీలకర్ర – పావు టీస్పూన్‌
* దాల్చినచెక్క పొడి – పావు టీ స్పూన్‌
* వాము – కొద్దిగా

హెర్బల్‌ టీ తయారు చేసే విధానం…

ఒక పాత్ర తీసుకుని అందులో 2 కప్పుల నీరు పోయాలి. అనంతరం పైన తెలిపిన పదార్థాలన్నింటినీ అందులో వేసి స్టవ్‌ను సిమ్‌లో పెట్టి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం తయారయ్యే టీని వడకట్టి వేడిగా ఉండగానే తాగేయాలి.

ఈ హెర్బల్‌ టీలో ఉండే అల్లం, తులసి, సోంపు గింజలు, జీలకర్ర, దాల్చినచెక్క, వాములు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నిత్యం ఒక్కసారి ఈ టీ తాగినా రోగ నిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు. ఈ టీని తాగడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news