వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వివాదాస్పద అంశం పై సినిమా తీస్తునట్టు తాజాగా ట్విటర్ లో పేర్కొన్నాడు అదే పవర్ స్టార్…! నేను పవర్ స్టార్ అనే సినిమాను తీస్తున్నాను నా సినిమాలో ఒక సినీ స్టార్ రాజకీయాల్లోకి వస్తాడు అతను ఎలా పతనం అవుతాడో అనేదే నా సినిమా కథ అంటూ నా సినిమాలో ఓ హీరో, ఓ రష్యా మహిళ, మగ్గారు పిల్లలు ఉంటారు అని ఆయన చెప్పాడు. ఇక తన సినిమాలోని ఫస్ట్ లుక్ ఇదేనంటూ మరో పోస్ట్ చేశాడు. ఫస్ట్ లుక్ లో ఉన్న వ్యక్తి అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా ఉండటం వివాదాన్ని రేపింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ఆర్జీవీ ని ట్వీట్టర్ లో ఓ మోత మ్రోగించారు.
ఇక అదే అంశాన్ని మరలా ప్రస్తావిస్తూ నేడు తాజాగా మరో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ఆర్జీవీ మాట్లాడుతూ… మీడియా వాళ్ళు నా పవర్ స్టార్ సినిమా ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథ అని తప్పుడు వార్తలు రాస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం…! నా సినిమా ఎవ్వరి బయోపిక్ కాదు, ఇదో కల్పిత కథ మాత్రమే. నా సినిమాలోని కథ ఓ సినీ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం తాను ఎలా పతనం అవుతాడో అనే అంశం. నా కథ ఎవరైనా నిజ జీవిత వ్యక్తికి కానీ పాత్రకి కానీ పోలి ఉంటే అది కేవలం కో-ఇన్సిడెన్స్ మాత్రమే ఉద్దేశపూర్వకం అస్సలు కాదు అంటూ ఆయన అన్నాడు.
My film POWER STAR is not any real persons biopic,but it is the fictional story of what a film star went through in the following days after a crushing defeat in the elections ..Any resemblance to any living person is purely coincidental pic.twitter.com/mdQ7fMpFJl
— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2020
Media speculations that POWER STAR is PAWAN KALYAN’s story is incorrect and irresponsible .. POWER STAR is a fictional story of a top film star who starts a party and loses in the elections ..Any resemblance to reality is accidentally coincidental . pic.twitter.com/xje6b7JKBS
— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2020