సినిమా నా హక్కు.. నాకు నచ్చింది చేస్తా…! మిగితావి కోర్టులో తేల్చుకుందాం- ఆర్జీవీ…!

-

వివాదాల డైరెక్టర్ ఆర్జీవీ ఎప్పుడు వివాదాన్నే తన అంశంగా ఎంచుకుంటాడు. ఏదైనా సంఘటన జరిగితే చాలు ఆ కథతో సినిమా తెసేస్తాను అంటాడు. ఇక ఇదే నేపద్యం మొన్న ఫాథర్స్ డే సందర్భంగా ఓ సినిమా పోస్టర్ ను విడుదల చేశాడు. ఆ సినిమా పోస్టర్ లో ఉన్న క్యారెక్టర్లు అమృత ప్రణయ్ ను అమృత తండ్రి మారుతి రావును పోలినట్టుగా ఉండటం సంచలనాన్ని రేపింది. ఇక ఈ సినిమాకు మర్డర్ అనే పేరుతో ఉన్న ఓ పోస్టర్ ను విడుదల చేశాడు. అప్పటినుండి ఆర్జీవీ కి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ముందు అమృత ఆర్జీవీ కి నోట్ రాసిందనే వార్తా షికార్లు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్ ను చేయడానికి వీల్లేదంటూ ప్రణయ్ తండ్రి పెట్టిన కేసు ఆర్జీవీ కి ఇబ్బందులను తెచ్చి పెట్టింది.

ఇక ఈ అంశం పై స్పందిస్తూ ఆర్జీవీ తన ట్వీటర్ ఖాతా ద్వారా ట్వీట్లు చేశాడు. ఆర్జీవి మాట్లాడుతూ.. మీడియాలో నా సినిమా మర్డర్ పై ఎవరో కేసు పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. నా సినిమా ఓ సామాజిక అంశం పై తీస్తున్న చిత్రం ఈ సినిమాలో నేను ఎవ్వరి పాత్రలను లాగడం లేదు నేను ఎవ్వరి కులాన్ని కూడా దూషించడం కానీ సినిమాలో చూపించడం కానీ చేయలేదు కాబట్టి నేను ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. ఒకవేళ చట్టపరంగా ఎవరినైనా ఎదురుకోవాలంటే నా అడ్వొకేట్ చూసుకుంటాడు. నాకు మాత్రం ఎవ్వరిని కించపరచాలని వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని లేదు. నా సినిమా ఓ ఆధుతమైన కథ, జరిగినది జరిగినట్టు చూపించాను. నాకు కూడా చట్టం పట్ల గౌరవం ఉంది. నా హక్కులను నేను వాడుకుంటున్నాను అవసరమైతే కోర్టుకు కూడా వెలతాను అంటూ ఆయన ట్వీట్ చేశాడు ఇప్పుడు ఈ ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news