త్వరలోనే బి-కేటగిరీలో లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడ్ ఎక్స్ పో ఇవాళ జరిగింది. ఈ మెడ్ ఎక్స్ పో కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మూడేళ్ల నుంచి కరోనా వల్ల ఎక్కడ మెడ్ ఎక్స్ పో జరగలేదని తెలిపారు.
గతంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్ రష్యా కి వెళ్లి చదువుకునే వారన్నారు. వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని వివరించారు. రేడియో థెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందిస్తామని.. రానున్న రోజుల్లో బి కేటగిరీలో లోకల్ రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటన చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.