బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. అక్టోబర్ 4, 2022 సాయంత్రం 5 గంటల వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి సమయం వుంది. కనుక ఆలోగా అప్లై చేసుకోవచ్చు.

పోస్టులను చూస్తే.. ఇంజనీర్ ట్రైనీ (సివిల్ లేదా మెకానికల్ లేదా IT లేదా ఎలక్ట్రికల్, కెమికల్, మెటలర్జీ), ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్),ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హెచ్‌ఆర్) లో ఈ ఖాళీలు వున్నాయి. మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ని కండక్ట్ చేస్తారు.

పరీక్ష అక్టోబర్ 31, నవంబర్ 1, 2, 2022 తేదీల్లో ఉంటుంది. పరీక్ష ఫీజు వివరాలను చూస్తే.. UR/EWS/OBC వాళ్లకి దరఖాస్తు రుసుము రూ.500 ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.300. SC/ST/PWD/Ex-Servicemen వాళ్లకి ఫీజు లేదు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ bhel.com లో చూడచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే..

మొదట అధికారిక వెబ్‌సైట్ bhel.comని ఓపెన్ చెయ్యండి.
తరవాత రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ మీద నొక్కండి.
నమోదు చేసుకుని. ఆ తరవాత లాగిన్ అవ్వండి.
ఫార్మ్ వస్తుంది ఫిల్ చేసి.. డాక్యుమెంట్స్ ని అప్ లోడ్ చెయ్యండి.
పేమెంట్ చెయ్యండి. సేవ్ చేసుకోండి అంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version