హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. 25, 26 తేదీల్లో ఈ ప్రాంతాల్లో ఆంక్షలు

-

హైదరాబాద్: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. సికింద్రాబాద్ పరిసరాల్లో ఉత్సవాలు జరిగే ప్రాంతాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ నెల 25, 26 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు మూసివేయనున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. ఈ నెల 25న తెల్లవారుజాము 4 గంటల నుంచి అమ్మవారి పూజలు పూర్తయ్యే వరకూ ఆ రోజు ఆంక్షలు కొనసాగుతాయి. ఆ తర్వాత 26వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గమనిక.. ఈ రోడ్లు మూసివేత
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సెయింట్‌ మేరీ మధ్య మార్గాలు మూసివేత. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి హకీంపేట, బోయిన్‌పల్లి, బాలానగర్‌, అమీర్‌పేట వెళ్లే వాహనాలకు క్లాక్‌ టవర్‌ మీదుగా ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌ వైపునకు అనుమతి. మహంకాళి గుడి, టొబాకోబజార్‌ హిల్‌ స్ట్రీట్‌, జనరల్‌ బజార్‌లో రోడ్డు మూసివేత. సుభాష్‌ రోడ్‌, బాటా చౌరస్తా నుంచి రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ఉన్న మార్గాలు కూడా మూసివేత. అడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం రోడ్లు మూసివేత. జనరల్‌ బజార్‌ నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ మార్గం రోడ్డు కూడా మూసివేత.

 

ఈ రూట్లలో వాహనాల దారి మళ్లింపు
కర్బల మైదాన్‌ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు.. రాణిగంజ్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి మినిస్టర్‌ రోడ్డు, రసూల్‌పురా క్రాస్‌ రోడ్స్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్స్‌, జాన్స్‌ రోటరీ, గోపాలపురం లేన్‌, రైల్వే స్టేషన్‌ వైపునకు అనుమతి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి వచ్చే బస్సులు ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లేందుకు అల్ఫా ఎక్స్‌ రోడ్డు హోటల్‌, గాంధీ ఎక్స్‌ రోడ్స్‌, సజ్జనాల స్ట్రీట్‌, ఓల్డ్‌ మహంకాళి ట్రాఫిక్‌ పీఎస్‌, ఘాస్‌మండి, , బైబుల్‌ హౌస్‌, కర్బల మైదన్‌ రూట్‌లో అనుమతి. తాడ్‌బన్‌ వెళ్లే బస్సులు క్లాక్‌టవర్‌, ప్యాట్నీ ఎక్స్‌ రోడ్డు, వైఎంసీఏ, ఎస్‌బీహెచ్‌ ఎక్స్‌ రోడ్స్‌ వైపు అనుమతి. బైబిల్‌ హౌస్‌ నుంచి వచ్చే వాహనాలు ఘాస్‌మండి ఎక్స్‌ రోడ్డు నుంచి సజ్జన్‌నాల్‌ స్ట్రీట్‌, హిల్స్‌ స్ట్రీట్‌ వైపు వెళ్లాలి. ఎస్‌బీహెచ్‌ చౌరస్తా నుంచి ఆర్‌పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్‌ టవర్‌, ప్యారడైజ్‌ వైపునకు అనుమతి. ప్యారడైజ్‌ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్‌ వద్ద ఎస్‌బీహెచ్‌, క్లాక్‌ టవర్‌ వైపునకు మళ్లింపు. క్లాక్‌ టవర్‌ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు ప్యాట్సీ ఎక్స్‌ రోడ్డు నుంచి ఎస్‌బీహెచ్‌ ఎక్స్‌ రోడ్డు, ప్యారడైజ్‌ వైపు అనుమతి. సీటీవో జంక్షన్‌ నుంచి ఎంజీ రోడ్డు వెళ్లే వాహనాలకు ప్యారడైజ్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు, సింధి కాలనీ, మినిస్టర్‌ రోడ్డు వైపు మళ్లింపు.

 

ఈ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్
సెయింట్‌ జాన్స్‌ రోటరీ, స్వీకార్‌, ఉపకార్‌, ఎస్‌బీహెచ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్‌, మహబూబీయ కాలేజీలో పార్కుకు అనుమతి.కర్బల మైదన్‌, బైబిల్‌ హౌస్‌, ఘాస్‌మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హై స్కూల్‌ ప్రాంగణంలో పార్కింగ్ చేసుకోవచ్చు. రాణిగంజ్‌, అడవయ్య క్రాస్‌ రోడ్స్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రభుత్వ అడవయ్య మెమోరియల్‌ హై స్కూల్‌ ప్రాంగణంలో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. సుభాష్‌ రోడ్డు వైపు వాహనాలు ఓల్డ్‌ జింఖానా మైదానంలో పార్కింగ్ అనుమతి. మంజు థియేటర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను అంజలి థియేటర్‌ లేన్‌లో పార్కింగ్‌కు స్థలం కేటాయింపు.

 

Read more RELATED
Recommended to you

Latest news