పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా..! సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం

-

పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు లేకపోవడంతో దాదాపుగా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న మిత్ర పక్షాలన్నీ.. విపక్షాలకు మద్దతు ఇస్తున్నాయి. 342 మంది ఉన్న జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ కు 172 సభ్యుల మద్దతు కావాలి. అయితే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు 164 మంది మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణంపై పాక్ చట్టసభల్లో చర్చ జరగనుంది. 

ఇదిలా ఉంటే నిన్న సైన్యం, ఐఎస్ఐతో సమావేశం నిర్వహించారు ఇమ్రాన్ ఖాన్. 24 గంటల్లో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సైన్యం అల్టిమేటం జారీ చేసింది. దీాంతో ఇమ్రాన్ ఈ సాయంత్రం రాజీనామా చేస్తారని తెలుస్తోంది. పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని  పాకిస్థాన్‌ అంతర్గత మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ వెల్లడించారు. ఈ రోజు జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరిగిన తరువాత రాజీనామా చేయనున్నట్లు పాక్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news