లేడీగెటప్లో వచ్చిన వ్యక్తి ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన ఆ గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో గ్రామంలో కొత్తవారు ఎవరూ కనిపించినా ఆ గ్రామçస్థులు జంకుతున్నారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి గ్రామానికి చెందిన గంగ, బాలరాజు ఇంటి ముందుకు ఓ వ్యక్తి లేడీ గెటప్‌లో వచ్చి బియ్యం కావాలని యాచించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు బియ్యం తీసుకు రావడానికి ఇంట్లోకి వెళ్లారు.
ఆ సమయంలో అక్కడే బయట ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారి దివ్యను ఎత్తుకెళ్లేందుకు పయత్నిస్తుండగా.. దివ్య తల్లి గట్టిగా కేకలు వేసింది. అరుపులు విన్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై లేడీ గెటప్‌లో ఉన్న వ్యక్తిని పట్టుకొని చితకబాడి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలపాలైన కిడ్నాపర్‌ను ఆస్పత్రిలో చికిత్స చేయించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కరాటే టీచర్‌గా..
నిందితుడికి సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామానికి చెందిన స్వామి ఓ పైవేటు స్కూల్లో కరాటే టీచర్‌గా పని చేస్తున్నాడని.. మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన వదినను చూసేందుకు రెండు రోజుల క్రితం పట్టణానికి వచ్చినట్లు పేర్కొన్నారు. డబ్బులు లేకపోవడంతో రెండ్రోజులుగా పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ చేస్తూ అవుసులపల్లి గ్రామానికి మహిళా దుస్తులు ధరించి వచ్చినట్లు తెలిపారు. ఈ కిడ్నాప్ కలకలం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.