మరికాసేపట్లో ఎర్త్ అవర్.. !

-

మరికాసేపట్లో ముఖ్యమైన భవనాలు, సందర్శనీయ ప్రాంతాలు చీకటిగా మారబోతున్నాయి. ఎర్త్ అవర్ లో భాగంగా వాతావరణ మార్పులు, పర్యావరణంపై అవగాహన కల్పించే ఉద్దేశంలో భాగంగా దీని నిర్వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం ఎర్త్‌ అవర్‌ అనే కాన్సెప్ట్‌ను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నిర్వహిస్తోంది.

ఈ సంవత్సరం ఇవాళ రాత్రి 8:30 నుంటి 9:30 గంటల సమయంలో ఎర్త్ అవర్ పాటించాలని కోరారు. ఇందులో భాగంగా ఇళ్లు, కార్యాలయాల్లోని లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, చార్మినార్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి,సచివాలయం, హుస్సేన్ సాగర్ లోని బుద్ద విగ్రహం, గోల్కొండ కోట, తెలంగాణ స్టేట్ సెంట్రల్ గ్రంథాలయంతో పాటు వివిధ భవనాల్లో విద్యుత్ డివైస్ లను ఆఫ్ చేయనున్నారు. ఈ ఎర్త్ అవర్ లో భాగంగా ప్రజలంతా కూడా తమ ఇళ్లలో లైట్లను స్విచ్ఛాఫ్ చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news