ఏపీలో కొనసాగుతున్న కరోనా కలకలం… నేడు కొత్తగా 10,328 కేసులు…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ 19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర అధికారులు, వైద్య సిబ్బంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరికి కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో 63,686 శాంపిల్స్ ను పరీక్షించగా 10,328 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,96,789 కు చేరుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 8516 మంది కోవిడ్ బారినుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

ap covid cases
ap covid cases

ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1351 కేసులు నమోదయ్యాయి. అలాగే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 223 మంది మృత్యువాతపడ్డారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72 కొవిడ్ 19 బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరణాల సంఖ్య 1753 కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 22,99,332 శాంపిల్స్ ను వైద్యులు పరీక్షించారు.