ఏపీలో.. ఆ పార్టీకి 123 స్థానాలు వస్తాయి: స్వామి పరిపూర్ణానంద

-

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎగ్జిట్ ఫలితాలు విడుదలైన విషయం అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సర్వేలు జగన్ నాయకత్వంలోని వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తుండగా, మరి కొన్ని సర్వేలు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి అధికారం చేపడుతుందని అంచనా ఇదిలా ఉంటే ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవుతారని ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు.

అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. గ్రామీణ మహిళలు అధికశాతం వైసీపీకే ఓట్లు వేశారన్నారు. దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మూడో సారి మోదీ ప్రధాని అవుతారని అంచనా స్వామి పరిపూర్ణానంద వేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ రేపు ఉదయం ప్రారంభం కానుంది. మరి ఎవరు గెలుస్తారు అనేది రేపు అధికారిక ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news