కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఎంతో కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీల నుండి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. అయితే వీరిలో ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కం డైరెక్టర్ రాఘవ లారెన్స్ సహాయం చేయడానికి ఒక లిమిట్ అనేది పెట్టుకోకుండా తమవంతు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాదితుల సహాయార్థం అక్షయ్ కుమార్ ముందు 25 కోట్లు ఆర్ధిక విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిస్మిదే. అంతే కాదు ఆ తర్వాత కూడా మరో మూడు కోట్లు ప్రకటించారు. ఇకముందు కూడా సహాయం చేయడానికి సిద్దం అంటూ తెలిపారు.
అలాగే రాఘవ లారెన్స్ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి డాన్స్ మాస్టర్ – దర్శకుడు లారెన్స్ కూడా ముందుకొచ్చారు. ఇప్పటికే చాలామందికి గుండే ఆపరేషన్స్ చేపించిన రాఘవ లారెన్స్ ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయం చేసే వారిలో ముందుటాడు. తను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం సమాజసేవకే ఖర్చు చేస్తుంటారు. ఇందులో భాగంగానే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి అందులో వికలాంగులకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లారెన్స్ కరోనా రిలీఫ్ ఫండ్ అంటూ 3 కోట్ల రూపాయలను డొనేట్ చేశాడు.
అందులో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. ప్రధానమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. డాన్సర్స్ అసోషియేషన్కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 లక్షలు తన సొంతూరి వాళ్ళకు ఇచ్చాడు లారెన్స్. అంతటితో ఆపకుండా మధ్యమధ్యలో మరిన్ని మంచి పనుల్లో సాయం అందిస్తున్నాడు. ఈ కష్టకాలంలో లారెన్స్ చేసిన మరో మంచి పనితో నిజమైన హీరోగా తమిళ సినీవర్గాలకు మరీంత దగ్గరయ్యాడు.
తమిళ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కి 25లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇటీవల తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా 15లక్షల వరకు శానిటేషన్ వర్కర్స్ కోసం అందజేశారు. అంతేకాదు ప్రతీ రోజు కరోనా కేసులు కొత్తవి నమోదవుతూ ఎక్కువవుతున్న నేపథ్యంలో వీలైంతవరకు సహాయం అందించడానికి ముందుంటానని వెళ్ళడించాడు. ఇలా ఈ ఇద్దరు అంతులేని సహాయాన్ని అందిస్తు స్పూర్తిగా నిలుస్తున్నందుకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.