కేసీఆర్ పదేళ్లలో..హైదరాబాద్ కు ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..? – జగ్గారెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ ముందు చూపుతో హైదరాబాద్ అభివృద్ధి కి 10 వేల కోట్ల నిధులు కేటాయించారు కానీ.. కేసీఆర్ కి ఆలోచన లేదు అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్,కేటీఆర్ లు రేవంత్….భట్టిలకు అభినందనలు చెప్పాల్సి ఉండే అని అన్నారు. హైదరాబాద్ కి కేసీఆర్ 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా.. అని ప్రశ్నించారు.కేసీఆర్ కి మనసులో రేవంత్ కొత్తగా సిఎం అయ్యి కూడా హైదరాబాద్ కి పది వేల కోట్లు పెట్టారు అని అనుకుంటారు.కానీ ప్రతిపక్ష నాయకుడిగా శెభాష్ అంటే… పార్టీ ఎంఎల్ఏ లు ఉంటారో ఉండ రో అనే భయం తో కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు అని ఆరోపించారు.

మంచి చేస్తే మేము అభినందిస్తం… అంత పెద్ద మనసు కేసీఆర్ కి ఉండదు అని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్.. ప్రజల అభివృద్ధి బడ్జెట్ అని అన్నారు.హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా చేయడం కోసమే మున్సిపల్ శాఖ కూడా తన దగ్గరే సిఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు అని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ హయంలో వచ్చింది అని వ్యూహాత్మకంగా జంటనగరాల అభివృద్ధికి నిధులు కేటాయించారు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news