ఆ విషయంలో అమ్మాయిలంతా ఈ హీరోయిన్లను చూసి నేర్చుకోవాల్సిందే..!

-

సాధారణంగా హీరోయిన్లు అంటే గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే .. అయితే ఇలా హీరోయిన్లు గ్లామర్ షో చేయడానికి కూడా కారణం లేకపోలేదు. అందాలతో రచ్చ చేస్తే తప్ప దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇది అన్నివేళలా వర్తించదు అని నిరూపిస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరి హీరోల సినిమాలకు హీరోయిన్గా కేరాఫ్ అడ్రస్ గా మిగిలింది శ్రీ లీల. రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా తర్వాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ప్రస్తుతం ఈమె చేతిలో ఏకంగా 10 ప్రాజెక్టులు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇక ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈమె వరస విజయాలను అందుకుంటూ కెరియర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే కేతికాశర్మ, కృతి శెట్టి లాంటి వాళ్ళు కథల ఎంపిక విషయంలో తడబడడం వల్లే వారి కెరియర్ నాశనమైందని అభిమానులు భావిస్తున్నారు. శ్రీ లీల కూడా కథలు ఎంపిక విషయంలో జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్న విషయం తెలిసిందే.

మరొక పక్కా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తుండగా ఆఫర్లను ఓకే చెప్పడం లేదని సమాచారం. ఇకపోతే ఇలా వరుసగా అవకాశాలను అందుకుంటున్న ఈమె గ్లామర్ రోల్స్ కంటే అభినయ ప్రధాన పాత్రలకు ఎక్కువ విలువ ఇస్తోంది. ఇక అలా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే మరొక హీరోయిన్ సాయి పల్లవి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఇప్పుడు వీరిద్దరూ ఎంతోమంది హీరోయిన్లకు అలాగే ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకి కూడా రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. స్కిన్ షో చేయకపోయినా సరే మన దగ్గర టాలెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారు అని నిరూపిస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఏది ఏమైనా వీరు మరి ఎంతో మందికి ఆదర్శం అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news