ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ గత కొన్నిరోజులుగా అనేక సమసమ్యలతో సతమతమవుతోంది. ట్విటర్ కు ఇప్పుడు థ్రెడ్స్ రూపంలో మరో తలనొప్పి మొదలైంది. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త యాప్ నకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ప్రారంభించిన ఒక్క రోజులోనే దాదాపు 3 కోట్లకు పైగా యూజర్లను సొంతం చేసుకుంది. అయితే, 24 గంటలు గడవకుముందే ఈ యాప్ న్యాయపరమైన సమస్యలో చిక్కుకుంది.
‘థ్రెడ్స్’ తమ మేథో సంపత్తి హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించిన ట్విటర్.. దానిపై దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో.. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ట్విటర్ మాజీ ఉద్యోగులను మెటా నియమించుకుందని ఆరోపించారు. ‘‘ఆ ఉద్యోగులు ట్విటర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత రహస్య సమాచారాన్ని కలిగి ఉన్నారు. కొనసాగిస్తున్నారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారని న్యూస్ వెబ్ సైట్ సెమాఫోర్ నివేదించింది.