ఎప్పటినుంచో బీజేపీకి దగ్గరవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 2018లో ఎన్డీయే నుంచి బయటకొచ్చి బిజేపితో గొడవలు పెట్టుకుని 2019లో ఘోరంగా ఓడిపోయి అధికారానికి దూరమైన టిడిపి..రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి సపోర్ట్ దక్కించుకుంటే కాస్త బెటర్ అనే ఆలోచనలో బాబు ఉన్నారు. కానీ కేంద్రంలో బిజేపి మాత్రం..జగన్ కే సపోర్ట్ ఇస్తుంది.
దీంతో బాబుకు రాజకీయంగా ఇబ్బందులు పెరుగుతున్నాయి. కానీ ఎలాగోలా బిజేపితో కలవాలని బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో పాటు బిజేపిని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఎన్నో ప్రయత్నాలు చేయగా, ఆ మధ్య అమిత్ షా…జేపి నడ్డాలని కలిసే అవకాశం వచ్చింది. దీంతో బిజేపికి బాబు దగ్గరయ్యారనే ప్రచారం వచ్చింది. అదే సమయంలో బిజేపితో కలిసి ముందుకెళితే రాజకీయంగా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని విశ్లేషణలు వచ్చాయి.
ఎలాగో ఏపీలో బిజేపికి బలం లేదు..నోటా ఓట్లని కూడా దాటని పరిస్తితి బిజేపికి ఉంది. ఈ క్రమంలో బిజేపితో కలిస్తే టిడిపికే నష్టమనే అంచనా వచ్చింది. అలాగే ఆటోమేటిక్ గా అది వైసీపీకి ప్లస్ అవుతుందని అన్నారు. దీంతో బాబు..బిజేపితో పొత్తుపై ఆలోచనలో పడ్డారు. పైగా సొంత కేడర్ సైతం బిజేపితో పొత్తుకు వ్యతిరేకంగా ఉంది. దీంతో బాబు పొత్తు ఆలోచనలు చేస్తున్నట్లు లేరు.
ఇదే తరుణంలో ఈ మధ్య జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో సహ విపక్షాల ఐక్య మీటింగ్ జరిగింది. ఐక్యంగా బిజేపికి చెక్ పెట్టాలని వాళ్ళు రెడీ అయ్యారు. ఈ తరుణంలోనే బిజేపి సైతం తమ మిత్రపక్షాలని కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ కు రెడీ అవుతుంది. దీనికి టిడిపిని ఆహ్వానించారని, ఆ పార్టీ హాజరవుతుందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ మీటింగ్ గురించి తమకు తెలియదని, తమకు సమాచారం లేదని, అయినా రాజకీయంగా అన్నీ చర్చుకున్నాకే ఏదైనా చేస్తామని, కాబట్టి మీటింగ్ కు వెళ్ళే ఛాన్స్ లేదని టిడిపి వర్గాలు అంటున్నాయి. అంటే ఎన్డీయే మీటింగ్‌కు టిడిపి హాజరు కావడం లేదు. బిజేపికి దూరంగానే ఉండాలని బాబు డిసైడ్ అవుతున్నట్లు తెలుస్తుంది.