మూడు రాజధానులు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు అన్న మాటలు వార్తల్లోకి వచ్చాయి.. దీనితో ఆంధ్రప్రదేశ్ బిజెపి లో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. దేశంలో అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో రాజధానులు నిర్మిస్తున్నారని వాటిపై వాటి పై కేంద్రం ఎప్పుడైనా జోక్యం చేసుకుందా అని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎంపీ సుజనా చౌదరికి కొంత ఇబ్బంది పడవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన సుజనా చౌదరి మీడియాకు తన వాదనను వినిపించారు.రాజధాని అమరావతి విషయంలో ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని బిజెపి ఎంపీ సుజనా చౌదరి పునరుద్ఘాటించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. న్యాయ సలహా తీసుకోకుండా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోరని వ్యాఖ్యానించారు.
పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానులను పెంచుకుంటూ పోవడం సరికాదు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5, 6లకు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని గవర్నర్ వద్దకు ప్రభుత్వం తీసుకెళ్లింది. న్యాయసమీక్ష లేకుండా ఈ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోరు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు, న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవు. రాజ్యసభ ఎంపీగా చెబుతున్నా.. కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకుంటుంది అని అన్నారు.