వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పై అనేక తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి ప్రజలు మభ్యపెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6 లక్షల 40 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 6 లక్షల 40 వేల కోట్లు అప్పు జగన్ మోహన్ రెడ్డి పాలనలో తీసుకున్నది కాదు.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కొవిడ్ పరిస్థితిని తట్టుకొని పరిపాలన వైఎస్ జగన్ పాలన చేశారు. కొవిడ్ సమయంలోను సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అప్పు చేసిన 3 లక్షల కోట్లలో 2 లక్షల 75 వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించారు. చంద్రబాబు చేసిన అప్పులు టిడిపి నాయకులు కార్యకర్తల కోసం ఉపయోగించారు. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారు అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.