2047కి భారత్ అగ్రదేశంగా మారబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2047లో ఏపీ కూడా దేశంలో నెంబర్ వన్ గా మారుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు కల్పిస్తున్నాం. మనకు పెద్ద ఆస్తి యువతే అన్నారు. నాలుగు ఇన్వెస్ట్ మెంట్ కేటగిరిలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తిని నింపిందేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గా పేరు పెట్టినట్టు వెల్లడించారు.
ఉద్యోగ కల్పన మొదటి ప్రాధాన్యతగా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ఏ పాలసీ తీసుకొచ్చినా ఉద్యోగాల కోసమే అన్నారు చంద్రబాబు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. సరైన నిర్ణయాలకు శాసన సభ వేదిక కావాలన్నారు. పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. పెట్టుబడుల ఆకర్షణకు MSME పాలసీలు తీసుకొచ్చాం. కనీసం 22 లక్షల MSMEలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రధాన కార్యాలయం ఉంటుందని తెలిపారు చంద్రబాబు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్ లు ఉంటాయని వెల్లడించారు.