రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరిశ్ రావుపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రికి వ్యతిరేకంగా బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫిర్యాదు చేశారు. సీఎంపై రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో హరీశ్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు ముఖ్యమంత్రిపై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ గతంలో తమ పార్టీతో పెట్టుకోవడం వల్లే ఎమ్మెల్యేగా గెలిచాడని, అప్పుడు నేను ముందుండి మీడియాతో మాట్లాడుతుంటే, టీవీలో కనిపించేందుకు రేవంత్ నిక్కి నిక్కి చూసిన వీడియోను హరీశ్ రావు సోషల్ మీడియాలో పోస్టు చేసి మరీ విమర్శించాడు. దీంతో హరీశ్ పై పోలీసులకు ఫిర్యాదు అందడం హాట్‌టాపిక్‌గా మారింది.