ఏపీలో తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ కు శ్రీకారం.. 500 వందల ఏసీ బస్సులను ప్రారంభించిన జగన్..

-

  • ఇదిరా జగనన్న పాలనంటే..
  • స్వయంగా జగనన్న చేపించినా తల్లి బిడ్డ ఎక్ష్ప్రెస్స్..
  • చంద్రబాబు కూడా చేతులెత్తి దండం పెట్టె విధంగా వుంది..

 

 

 

 

ఆంధ్రప్రదేశ్: డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలలో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను ఇవాళ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. నెలలు నిండి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే అక్కచెల్లెమ్మలను, వారి ఇంటి నుండి 108 వాహనంలో తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి నాణ్యమైన వైద్యసేవలు, డబ్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందిస్తారు.

ప్రసవానంతరం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం రూ. 5000 చేతిలో పెట్టి మరీ ఆ తల్లీబిడ్డలను అంతే క్షేమంగా ఇంటికి చేర్చుతారు. డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రవేశపెట్టడంతో పాటు సేవలను విస్తరించిన కారణంగా ఏడాదికి సగటున 4 లక్షల మందికి ఈ మంచి సౌకర్యం అందుబాటులోకి రానుంది. తల్లులకు సహాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత కాల్‌ సెంటర్‌ , ప్రసవానంతర తల్లుల సౌకర్యార్ధం నర్సులు, డ్రైవర్ల సమన్వయం కోసం వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news