పింకీల అధికారం దాహన్ని బీజేపీ చూస్తూ ఊరుకోదని కేసీఆర్ కు రాములమ్మ వార్నింగ్ ఇచ్చింది. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్… ఇప్పుడు రాష్ట్రాన్ని రైతు ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నాడని.. ఒక్కవైపు… పండిన పంట కొనేది లేదని ప్రకటనలు చేస్తూ రైతన్నలను ఆందోళనకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు బలవంతపు భూసేకరణ చేస్తూ… రైతన్నల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాడని… కాళేశ్వరం అడిషనల్ కెనాల్ నిర్మాణానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకున్నా కేసీఆర్ సర్కార్ బలవంతంగా భూసేకరణ చేస్తోందని ఆగ్రహించింది.
సర్కారు తీరుతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అడిషనల్ ఎంసీ కెనాల్‌లో భూమి పోతుందనే మనస్తాపంతో రామడుగు మండలం శ్రీరాములపల్లెకు చెందిన రైతు మరణించారని మండిపడ్డారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే కేసీఆర్ దీనికేం సమాధానం చెబుతారు ? రైతుల మరణాలన్నీ ముమ్మాటీకి ప్రభుత్వ హత్యలే… శ్రీరాములపల్లె గ్రామంలో ఇప్పటికే మూడు దఫాలుగా రైతుల భూములను వరద కాలువ, పిల్ల కాలువ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సేకరించారని ఫైర్ అయ్యారు విజయశాంతి.
అవసరం లేకున్నా ఇప్పుడు మళ్లీ సేకరిస్తున్నారని… రైతుల మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.రైతుల ఉసురు తీస్తున్న టీఆర్ఎస్ సర్కార్ ఆటలు ఎంతో కాలం సాగవని… నిరంకుశ పాలన కొనసాగిస్తూ… అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న పింకీల అధికారం దాహన్ని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేసీఆర్… నీ కారును, నీ సర్కార్‌ను తోందర్లోనే కాలగర్భంలో కలిపేయడం ఖాయమని..విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు.