మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్లకు గుడ్ న్యూస్. మున్సిపల్ శాఖలో ఔట్ సోర్సింగ్ NON-PH (నాన్-ప్రొఫెషనల్) వర్కర్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేటగిరి-1 వర్కర్ల వేతనం రూ. 21,500 నుంచి రూ. 24,500కు, కేటగిరి-2 వర్కర్ల వేతనం రూ. 18,500 నుంచి రూ. 21,500కు, కేటగిరి-3 వర్కర్ల వేతనం రూ. 15,000 నుంచి రూ. 18,500కు పెంచింది.

కాగా, తమకు వేతనాలు పెంచాలని వీరు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తిరుమల వెళ్లే ఎన్నారై భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టిటిడి పాలక మండలి. ఇక పైన ఎన్నారై భక్తులకు ప్రతిరోజు 100 విఐపి బ్రేక్ దర్శన టికెట్లు అందించేందుకు సిద్ధమైంది. చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో తిరుమలలో ఎన్ఆర్ఐ భక్తులకు అందించే విఐపి బ్రేక్ దర్శన కోట 50 నుంచి పదికి తగ్గించారు.