IND VS ENG: రెండో వన్డేలో భారత మాజీ క్రికెటర్ల సందడి

-

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన ఇంగ్లండ్‌-భారత్‌ రెండో వన్డేలో టీమిండియా జట్టు ఊహించనిరీతిలో పరాజయం చవి చూసింది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో 247 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా పేలవంగా 38.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దాంతో.. 100 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ టీమ్.. మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డే మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది.ఇక రెండో వన్డే మ్యాచ్ చూడడానికి భారత జట్టు మాజీ క్రికెటర్లు తరలివచ్చారు.

2011 వన్డే ప్రపంచకప్ టీమ్ లో సభ్యులుగా ఉన్న వాళ్లలో నలుగురైదుగురు ఈ మ్యాచ్ చూడడానికి రావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ కు ముందు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం రైనా, ధోనీలే. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సచిన్, సౌరవ్ గంగూలీ ఒకేచోట కూర్చుని మ్యాచ్ చూస్తున్న విజువల్స్ కెమెరాలో పదేపదే కనిపించాయి. వీరిద్దరు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా స్టేడియంలో సందడి నెలకొంది. ఇక హర్బజన్, రైనా ఒకేచోట కూర్చుని మ్యాచ్ వీక్షించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news