IND VS ENG : చరిత్ర సృష్టించిన జేమ్స్ అండర్సన్

-

ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. ధర్మశాల వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టులో అరుదైన రికార్డ్ సాధించాడు.147ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్ గా నిలిచారు. 187టెస్టుల్లో అండర్సన్ ఈ ఫీట్ సాధించారు.

ఈ టెస్టులో ఇండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ను ఔట్ చేయడంతో ఈ రికార్డు నమోదైంది. కాగా టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్ల రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముతయ్ మురళీధరన్ పేరిట ఉంది. సెకండ్ ప్లేస్ లో వార్న్ (ఆస్ట్రేలియా) – 708 వికెట్లు(145 మ్యాచుల్లో) ఉన్నాడు. ఇండియా నుంచి కుంబ్లే (ఇండియా) – 619 వికెట్లు(132 మ్యాచుల్లో) ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు.బ్రాడ్ (ఇంగ్లండ్) – 604 వికెట్లు (167 మ్యాచుల్లో) తో ఐదవ స్థానంలో ఉన్నాడు.

ఇక ఈ టెస్టులో టీమ్ ఇండియా 477 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 259 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రోహిత్(103), గిల్(110) సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news