కోలివుడ్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్ విడిపోతున్నట్లు కొంత కాలంగా తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నయనతార భర్తను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం మళ్లీ కొంతసేపటికి ఫాలో చేయడం. ‘నేను సర్వం కోల్పోయాను’ అని పోస్ట్ పెట్టడం. మళ్లీ దాన్ని డిలీట్ చేయడం ఇవ్వన్నీ వారి విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే వీరు తాజాగా ఆ రూమర్స్‌కు మరోసారి చెక్ పెట్టారు.
తమ కవల పిల్లలతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లారు నయన్ దంపతులు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. నయనతార ఫొటోలను షేర్ చేసిన విఘ్నేశ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ఆమె రిప్లై ఇస్తూ.. ‘నన్ను ఇంత గొప్ప మహిళగా మార్చినందుకు ధన్యవాదాలు’ అంటూ హార్ట్ ఎమోజీలు పెట్టారు. ఫారిన్లో ఎంజాయ్ చేస్తోన్న వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం అవి ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలతో వీరి విడాకుల రూమర్స్‌కు ప్రస్తుతం ఫుల్స్టాప్ పడింది.
Here's how they put an end to stupid divorce romours 👊🔥
They're happy, Ever & forever ♥️#Nayanthara @VigneshShivN #NayanWikki #Uyir #Ulag #SpreadLove pic.twitter.com/IK6wV7giIf
— Ever & Forever for Nayan 👀💫❤️ (@SathsaraniSew) March 7, 2024