IND VS ENG : ఈ బంతిని ఎలా ఆడాలి బుమ్రా..?

-

విశాఖలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో టీం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్టు మ్యాచ్లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను ఔట్ చేసిన బాల్ వాస్తవంగా బ్యాటర్ నుంచి ఔట్ స్వింగ్ కావాల్సి ఉండగా.. బుమ్రా రివర్స్ స్వింగ్ నైపుణ్యంతో లోపలికి దూసుకొచ్చి వికెట్లను తాకింది. ఔట్ కాగానే, ఇలాంటి బంతిని ఎలా ఆడాలన్నట్లుగా స్టోక్స్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మ్యాచ్లో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా కొత్త రికార్డును సృష్టించారు. మొత్తం ఆరు వికెట్లను పడగొట్టి టెస్టుల్లో అత్యంత వేగంగా (34 మ్యాచులు) 150 వికెట్లు సాధించిన ఇండియా పేస్ బౌలర్గా నిలిచారు.అయితే ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లండ్‌ 253 రన్స్‌కు కుప్పకూలింది. దీంతో ఇండియకు 143 పరుగుల ఆధిక్యం దక్కగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. దీంతో ఇండియా ఆధిక్యం ఓవరాల్‌గా 171 రన్స్ కు చేరింది. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైస్వాల్‌ 17, రోహిత్‌ శర్మ 13 ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news