IND vs SL : శ్రీలంకకు మరో షాక్.. మరో యంగ్ పేసర్ దూరం

-

స్వదేశంలో ఇండియాతో సిరీస్ ఆరంభం కాకముందే శ్రీలంకకు మరో షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే చమీర టీ20 సిరీస్‌కు దూరం అయిన విషయం తెలిసిందే.తాజాగా మరో యంగ్ ప్లేయర్ నువాన్ తుషార అందుబాటులో ఉండడం లేదు. నెట్స్‌లో బౌలింగ్‌, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా నువాన్ తుషార ఎడమ చేతి వేలికి గాయమైంది.దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ నిర్వహించగా చేతి వేలు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు.

దీంతో తుషార టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడని లంక జట్టు మేనేజర్ మహింద హలంగోడ వెల్లడించారు. అతడి స్థానంలో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నామని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో తుషార ఉన్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా టీ20 జట్టులో తుషార కీలక ఆటగాడిగా ఉంటూ.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ ఏడాది బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా 5 వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version