40 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన రిషబ్ పంత్ … బెంగళూర్ టెస్ట్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ

-

బెంగళూర్ వేదికగా శ్రీలంకతో జరుగున్న 2వ టెస్ట్ లో ఇండియా దుమ్మురేపుతోంది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో అదరగొట్టింది. ఇదిలా ఉంటే ఈ పింక్ బాల్ టెస్ట్ లో మరో రికార్డ్ నమోదైంది. టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తం 31 బాల్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 50 పరుగుతు చేశారు. కపిల్ దేవ్ పేరిట ఉన్న 40 ఏళ్ల రికార్డ్ ను బద్దలు కొట్టాడు. 1982లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. వీరి తరువాత శార్థాల్ ఠాకూర్ 31 బంతుల్లో, వీరేంద్ర సెహ్వాగ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.

చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ డే నైట్ టెస్ట్ లో భారత్ పై చేయి సాధిస్తోంది. మొదటి ఇన్సింగ్స్ లో 252 పరుగులకు ఇండియా ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసి శ్రీలంక కేవలం 109 పరుగులకే చాపచుట్టేసింది. బూమ్రా సూపర్ బౌలింగ్ తో అదరగొట్టాడు. 5 వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. మరోవైపు అశ్విన్, షమీ చెరో రెండు వికెట్లు తీశారు. 143 పరుగుల లీడ్ తో రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంత్ 50, రోహిత్ శర్మ 46, హనుమ విహారి 35 పరుగులు చేశారు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్  18, రవీంద్ర జడేజా 10 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మొత్తంగా ఇండియా, శ్రీలంకపై 342 పరుగుల లీడ్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version