IND vs SL : నేడే పింక్ బాల్ టెస్ట్.. క్లీన్‌స్వీపే ల‌క్ష్యంగా టీమిండియా

-

వ‌రుస విజ‌యాలతో టీమిండియా ఫుల్ జోష్ మీదా ఉంది. ఇప్ప‌టికే వెస్టిండీస్ తో జ‌రిగిన సిరీస్ ల‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసేసింది. తాజా గా టీమిండియా క్లీన్ స్వీప్ గురి శ్రీ‌లంక‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్ పై ప‌డింది. రెండు టెస్టు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్ప‌టికే ఒక మ్యాచ్ లో భారీ విజ‌యం సాధించి 1-0 తేడాతో ముందు ఉంది. కాగ నేడు చివ‌రి టెస్టు ప్రారంభం కానుంది. కాగ ఈ టెస్టు డై అండ్ నైట్ మ్యాచ్ గా పింక్ బాల్ తో జ‌ర‌గ‌నుంది.

భార‌త్ చివ‌రి సారిగా డై అండ్ నైట్ మ్యాచ్ ను 2021లో ఇంగ్లాండ్ తో ఆడింది. చాలా రోజుల విరామం త‌ర్వాత నేడు మ‌ళ్లీ పింక్ బాల్ ప‌ట్టుకోనుంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు టీమిండియా కేవ‌లం మూడు పింక్ బాల్ టెస్టు మాత్ర‌మే ఆడింది. మొద‌టి పింక్ బాల్ టెస్టు బంగ్లాదేశ్ తో త‌ర్వాతి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో ఆడింది. ఇదీల ఉండ‌గా.. ఈ టెస్టు మ్యాచ్ లో రికార్డులు సృష్టించడానికి ఆట‌గాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్ ఆడితే రోహిత్ శ‌ర్మ కేరీర్ లో అంత‌ర్జాతీయంగా అన్ని ఫార్మెట్లు క‌లిపి 400 మ్యాచ్ లు ఆడిన ఆట‌గాడుగా రికార్డు సృష్టిస్తాడు.

జ‌డేజా మ‌రో 9 వికెట్లు తీస్తే.. టెస్టుల్లో 250 వికెట్లు తీస‌న బౌల‌ర్ గా నిలుస్తాడు. అలాగే జ‌డ్డు మ‌రో 130 ప‌రుగులు చేస్తే.. టెస్టుల్లో 2,500 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలుస్తాడు. అశ్విన్ 95 ప‌రుగులు చేస్తే.. టెస్టుల్లో 3,000 ప‌రుగులు అవుతాయి. బుమ్రా 300 వికెట్ల క్ల‌బ్ లో చేరాలంటే.. ఇంకా 5 వికెట్లు తీయాలి. ఇంకా చాలా రికార్డుల కోసం ఆట‌గాళ్లు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news