ఇటీవల భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. నిన్న ఒక్క రోజే బంగారం ధరలు రూ, 1,750 వరకు తగ్గిపోయాయి. కాగ నేడు బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. కాగ నిన్న భారీగా తగ్గిన ధరలు..ఈ రోజు నిలకడగా ఉండటంతో ఈ రోజు కూడా బంగారం కొనుగోల్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 48,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,580 గా ఉంది.
కాగ ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా చమురు ధరలతో పాటు బంగారం, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాగ శుక్ర వారం వెండి ధరలు కూడా విపరీతంగా తగ్గాయి. నిన్న ఒక్కరోజే వెండిపై రూ. 2,600 తగ్గింది. కాగ కొనుగోలు దారులకు షాక్ ఇస్తు.. ఈ రోజు మళ్లీ వెండి ధరలు పెరిగాయి. ఈ రోజు ప్రతి కిలో గ్రాము వెండిపై రూ. 500 వరకు పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో గ్రాము వెండి ధర రూ. 74,600 గా ఉంది. ఈ రోజు స్వల్పంగా పెరిగినా.. త్వరలో వెండి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.