దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఓ ఇండిపెండెంట్ అభ్యర్ధి కారణమయ్యారా అన్న దానిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.ఇండిపెండెంట్ అభ్యర్ధి నాగరాజు కి కారును పోలిన గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. దీంతో స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజు 3,489 ఓట్లు పడ్డాయి. బీజేపీ,టీఆర్ఎస్,కాంగ్రెస్ తర్వాత నాగరాజు నాలుగో స్థానంలో నిలిచాడు.
ఉప ఎన్నికలో మొత్తం 1,64,186 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోలయ్యాయి స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజు కి 3 వేలకు పైగా పోలయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోలవ్వగా, అందులో 1381 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 60 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. గత సార్వత్రిక ఎన్నికల్లోను కారు పోలిన సింబల్ తో పలువురు టీఆర్ఎస్ అభ్యర్ధులు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.