20 యూ ట్యూబ్ ఛానెళ్లు, 2 వెబ్ సైట్లు బ్యాన్… యాంటీ ఇండియా విధానాలపై కేంద్రం కన్నెర్ర

-

యాంటీ ఇండియా, పాక్ అనుకూల విధానాలను అవలంభిస్తున్న 20 యూ ట్యూబ్ ఛానెళ్లతో పాటు 2 వెబ్ సైట్లను బ్యాన్  చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్‌లో భారత వ్యతిరేక ప్రచారం మరియు ఫేక్ న్యూస్ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నందుకు యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

భారత దేశాన్ని దూషించడం దగ్గర నుంచి సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు. ఇందులో వస్తున్న కంటెంట్ పాకిస్థాన్, ఐఎస్ఐకి సంబంధించినవి కూడా ఉంటున్నాయి. బ్లాక్ చేసిన ఓ పోర్టల్‌లలో ఒకటి ‘నయా పాకిస్తాన్ గ్రూప్’గా గుర్తించబడింది. ఇది 15 యూట్యూబ్ ఛానెల్‌లను నడుపుతోంది. దీంట్లో భారత్ కు వ్యతిరేఖంగా విద్వేశాన్ని రెచ్చగొడుతోంది.

నిషేధించబడిన యూట్యూబ్ ఛానెల్‌లు భారత సైన్యం, కాశ్మీర్, భారతదేశంలోని మైనారిటీ కమ్యూనిటీలు, సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, రామ మందిరం వంటి అంశాలపై  విద్వేష కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ఉపయోగించబడ్డాయి. వీటితో పాటు రైతుల నిరసనలు మరియు CAA నిరసనలు వంటి సమస్యలపై కంటెంట్‌ను కూడా పోస్ట్ చేశారు. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్‌లు, వెబ్‌సైట్‌లు దేశంలోని మైనారిటీలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించాయి.

Read more RELATED
Recommended to you

Latest news