WORLD CUP: బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లు ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే కప్ మనదే !

-

ఇండియా జట్టులో ఎప్పుడూ బ్యాటింగ్ మీద ఆధారపడే విజయాలు సాధిస్తూ వచ్చాయి. చరిత్ర మొత్తం చూసినా ఇదే కనిపిస్తుంది… కానీ ఇప్పుడు ఇండియా బౌలింగ్ యూనిట్ చూస్తే చాలా ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు బుమ్రా , సిరాజ్ లు అద్భుతమైన ఫామ్ లో ఉండడం జట్టుకు బాగా లాభించే అంశం. వీరిద్దరికీ పిచ్ నుండి కొంచెం సపోర్ట్ దొరికినా ప్రత్యర్థిని మడతపెట్టేస్తారు. ఇందుకు చక్కని ఉదాహరణ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్, ఏ ఒక్క అభిమాని కూడా ఈ తరహా ఫలితాన్ని ఊహించి ఉండరు.. కేవలం ఓవర్ లలోనే ప్రత్యర్థిని 50 పరుగులకు ఆల్ అవుట్ చేసి సిరాజ్ సింగల్ హ్యాండ్ విజయాన్ని ఇండియాకు అందించాడు. ఇక ఈ సిరీస్ చైనామన్ కుల్దీప్ యాదవ్ సైతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇతని స్పిన్ ను పసిగట్టడం ఎంతకష్టమో పాకిస్తాన్ ను అడిగితే తెలుస్తుంది.

వీరు ముగ్గురూ కనుక ఇదే ఫామ్ ను కొనసాగిస్తే ఖచ్చితంగా వరల్డ్ కప్ మనదే అవుతుంది. మరి ఇండియాలో జరగనున్న ఈ వరల్డ్ కప్ కు ఎక్కువ పాజిటివ్ లు మనకే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news