అందరి బాగుండాలని కోరుకునే “విజయ్ ఆంథోనీ”కి ఇలాంటి కష్టమా !

-

ఈ రోజు ఉదయం తమిళ నటుడు విజయ్ ఆంథోనీ కూతురు మీరా సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఈ ఇంటిలో నుండి వెళ్ళడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఎందుకంటే 16 సంవత్సరాల పాపను పోగొట్టుకోవడం అంటే ఎంత కష్టమో ? హృదయం ఎంతలా బాధపడుతుందో చెప్పలేము. ఏ తల్లి తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు. కాగా మీరా మరణానికి కొన్ని రోజుల ముందు విజయ్ ఆంథోనీ ఒక ప్రోగ్రాం లో మాట్లాడుతూ.. ఆత్మహత్యల గురించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక పేరెంట్స్ గా మనము మన పిల్లల స్వేచ్చకు, వారి ఆలోచనలకు విలువను ఇవ్వాలని.. వాళ్ళు కెరీర్ లో ఏమి అవ్వాలని అనుకుంటే ఈ దిశలో వెళ్లేలా మనము మార్గం చూపాలంటూ చాలా మంచి మాటలను మాట్లాడారు. ఇంకా ముఖ్యంగా చదువుల గురించి ఒత్తిడి చేయకుండా, వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఉండాలంటూ ఎన్నో మాటలు చెప్పారు.

అందరికీ దైర్యం చెప్పిన విజయ్ ఆంథోనీ తన బిడ్డకే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారు. అందరి బాగును చూడాలని అనుకున్న విజయ్ ఆంథోనీ కి ఇంత కష్టమా అంటూ నెటిజన్లు బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news