హైదరాబాద్ లో మరో దారుణం : నవ వధువు సూసైడ్

హైదరాబాద్ శివారు నార్సింగీ మిర్జాగూడ ఇంద్రారెడ్డి నగర్ కాలనీ లో విషాదం చోటు చేసుకుంది. రేవతి అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఆ నవ వధువు. కుటుంబ కలహాల తోనే రేవతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. గత ఏడు నెలల క్రితం రాహుల్ అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకున్న రేవతి… తరచూ భర్త తో గొడవ పడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యం లోనే నిన్న రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కు తాడు తో ఉరి వేసుకుంది రేవతి. దీంతో రాహుల్ కుటుంబ సభ్యుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు నార్సింగీ పోలీసులు. ఇక కేసు నమోదు చేసి……దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు. రేవతి ఆత్మహత్య కు గల కారణాలను ఆరా తీస్తున్నారు. రాహుల్ కు రేవతి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా? ఏ విషయంలో ఘర్షణ జరిగింది? అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.