ఇండియాలో పెరిగిన కరోనా… కొత్తగా 16,326 కేసులు

చైనాలో పుట్టిన కరోనా మమహ్మరి ఇండియా ను వదిలేలా లేదు. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ మరో సారి పెరిగి పోయాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 16,326 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,73,728 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 666 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17, 677 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3, 35, 32, 126 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 101.30 కోట్ల కు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59. 84 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేట్‌… . 1.20 గా నమోదైంది.