Prabhas: “గ్లోబ‌ల్ స్టార్”కు ఇన్‌స్టాగ్రామ్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ! ఆ గిఫ్టేంటో తెలుసా..!

-

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ .. ‘బాహుబలి’ సినిమాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానలను సాధించుకుని గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. త‌న కెరీర్ లో దూసుక‌పోతున్నాడు. ఇవాళ డార్లింగ్ ప్రభాస్ 42వ‌ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త‌న అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విషెస్ లు చెప్తున్నారు. ప్రభాస్ బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు.

రెబ‌ల్ స్టార్ కృషం రాజు న‌ట‌వార‌సుడిగా ఈశ్వ‌ర్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్ సినిమాలతో డ్రిమ్ బాయ్ గా మారాడు. కేవలం 17 సినిమాలకే పాన్ ఇండియా స్టార్ గా ఎనాలేని ఖ్యాతిని సంపాదించాడు.

ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్ కు సోషల్ మీడియాలో కూడా అభిమాన గణం ఎక్కువే. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా పెద్ద ఎత్తున త‌న ఫ్యాన్స్ గ్రీటింగ్స్ వెల్లువెత్తున్నాయి. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రభాస్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. గ్లోబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ డే అంటూ కొత్త ఫిల్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ ఫిల్ట‌ర్ కు రాధేశ్యామ్ టీజ‌ర్‌లోని మ్యూజిక్‌ను అనుసందానం చేస్తూ రూపొందించారు. ప్ర‌స్తుతం ఈ ఫిల్ట‌ర్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. అభిమానులంతా ఈ ఫిల్టర్ తో రీల్స్ చేస్తున్నారు పోస్టు చేస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రాధే శ్యామ్ సినిమాతో సంక్రాంతి బ‌రిలో నిలువ‌నున్నారు. మ‌రో వైపు.. వ‌రుస‌గా.. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్’, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆదిపురుష్’ , అలాగే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు రాబోతున్నాయి. ఇక ప్రభాస్ కెరీర్‌లో మైల్ స్టోన్ అయిన 25వ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నాడు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఏ హీరోకి సాధ్యంకాని సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news