ఇండియాలో భారీ తగ్గిన కరోనా.. కొత్తగా 18,346 కేసులు

దేశంలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ… మరోరోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజున… 20 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు… ఇవాళ భారీగా తగ్గిపోయాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… దేశంలో గడచిన 24 గంటల్లో 18,346 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,52,902 కు చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 29,639 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.93 శాతంగా ఉంది. ఇక తాజాగా కరోనా కేసులతో దేశం లో మొత్తం కేసుల సంఖ్య 33,853,048 కు చేరింది. ఇక కేరళ రాష్ట్రం లో గడిచిన 24 గంటల్లో 8,850 కరోనా కేసులు నమోదు కాగా… 149 మరణాలు నమోదు అయ్యాయి. కాగా… దేశం లో ప్రతి రోజూ 50 లక్షల కు పైగా వ్యాక్సిన్లను అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ…ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.