క్రికెట్ పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది: షాహిద్ అఫ్రిది

-

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత్ పై అక్కసును వెళ్లగక్కాడు. ప్రపంచ క్రికెట్ పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది అంటూ విమర్శలు చేశాడు.” ప్రపంచ క్రికెట్లో బిసిసిఐ కీలక పాత్ర పోషిస్తోంది. వాళ్లు ఏం చెప్తే అదే ప్రపంచ క్రికెట్ లో జరుగుతోంది. క్రికెట్ పై భారతదేశం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఐపీఎల్ 2022 సీజన్ 2 నెలల పాటు నిర్వహించడం వల్ల దాని ప్రభావం అంతర్జాతీయ టోర్నీలపై పడుతోంది.

ఇండియాలో క్రికెట్ ఆదరణ ఎక్కువ.. ఆ మార్కెట్ ను అడ్డుపెట్టుకొని బీసీసీఐ బాగా సంపాదిస్తోంది. ఆ ఆదాయంతోనే ప్రపంచ క్రికెట్ ను శాసిస్తుంది”. అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించాడు. అయితే ఈ పాక్ మాజీ క్రికెటర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఇటీవల జరిగిన ఐపీఎల్ ప్రసార హక్కుల వేలానికి సంబంధించినవే అని తెలుస్తోంది. ఎందుకంటే 2023-2028 కి సంబంధించి టీవీ/డిజిటల్ ప్రసార హక్కులను bcci వేలంలో 48 వేల కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఆ వార్తను జీర్ణించుకోలేకే షాహిద్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news