భారత్ నుండి 50 లక్షల టీకాల ఎగుమతి…!

-

భారత్ నుండి మరోసారి వ్యాక్సిన్ లు ఎగుమతి కానున్నాయి. దేశం నుండి మొత్తం 50లక్షల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేయనున్నారు. ఇప్పటికే నేపాల్ సహా ఇతర దేశాలకు మన దేశం నుండి వ్యాక్సిన్ లను సరఫరా చేశారు. కాగా ఇప్పుడు ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని “కోవాక్స్” కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్, నేపాల్, తజికిస్తాన్, మెజాంబిక్ దేశాలకు కోవీషీల్డ్ వ్యాక్సిన్ లను అందించనున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ లో 24.89 కోట్ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోస్ ల స్టాక్ పేరుకుపోయింది.

దాంతో వాటిని వేగంగా పంపిణీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తో ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ కు ముందు మన దేశం నుండి వ్యాక్సిన్ లు ఎగుమతి చేయడం తో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రస్తుతం దేశంలో సైతం కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ లు ఎగుమతి చేయడం పై ప్రశంసలు కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news