ఈ రోజు సీరీస్ గెలుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు వచ్చింది. ఈ మ్యాచ్ లోనూ కోహ్లీ రోహిత్ లు లేకపోవడంతో అందరిలోనూ ఎన్నో అనుమానాలు.. గెలుస్తారా ? అసలు విండీస్ ముందు టార్గెట్ ఎంత పెడతారు ? ఇలా ఆలోచించారు.. కానీ ఇండియా ఆటగాళ్ళు చాలా మెరుగ్గా ఆడి నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ నుండి హర్ధిక్ పాండ్య వరకు తలో చెయ్యి వేశారు. ముందుగా ఇషాన్ కిషన్ 77 మరియు గిల్ 85 పరుగులు. చేశారు. వీరి బాటలోనే శాంసన్ 51 పరుగులు చేశాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం 8 పరుగులు చేసి విఫలం అయ్యాడు. కెప్టెన్ హార్థిక్ పాండ్య (70) అద్భుతంగా రాణించి ఇండియాకు 351 పరుగులు రావడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ స్కోర్ ను వెస్ట్ ఇండీస్ చేదించి సీరీస్ ను సొంతం చేసుకుంటుందా లేదా ఇండియా బౌలింగ్ ఎటాక్ కు దాసోహం అయ్యి సీరీస్ ను ఆతిథ్య టీమ్ కు అప్పగిస్తుందా చూడాలి.