పారాలింపిక్స్‌ లో భారత్ మరో రెండు పతకాలు

పారాలింపక్స్‌ లో భారత ఆథ్లెట్లు తమ జోరును కొనసాగిస్తున్నారు. తాజాగా పారాలింపిక్స్‌ లో భారత్‌ కు మరో రెండు పతకాలు వచ్చాయి. హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు రజత పతకం సాధించగా… ఇదే హై జంప్‌ లోనే శరద్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించారు.

హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు మరియు శరద్‌ కుమార్‌ ఇద్దరు పతకాలు సాధించడటం గమనార్హం. దీంతో ఇవాళ భారత్‌ కు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు వచ్చినట్లైంది. ఇక ఇవాళ వచ్చిన పతకాలతో ఇండియాకు వచ్చిన పతకాల సంఖ్య పది కి చేరింది. ఈ పతకాల్లో రెండు గోల్డ్‌ మెడల్స్ కాగా… 5 రజతాలు మరియు 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక  హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు మరియు శరద్‌ కుమార్‌ ఇద్దరు పతకాలు సాధించడటం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇటు క్రీడా ప్రియుల నుంచి కూడా వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.