మేకిన్ ఇండియా: వాట్సాప్ కి పోటీగా వస్తున్న యాప్..

Join Our Community
follow manalokam on social media

గత కొన్ని రోజులుగా వాట్సాప్ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రైవసీ పాలసీని మారుస్తూ ఫేస్ బుక్ తో వాట్సాప్ విషయాలని పంచుకుంటామని చెప్పినప్పటి నుండి వాట్సాప్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మన దేశంలో చాలా మంది వాట్సాప్ ని డిలీట్ చేసారు. ప్రత్యామ్నాయ యాప్ అయిన సిగ్నల్, టెలిగ్రామ్ లని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ యాప్ ల డౌన్లోడ్ మిలియన్లకి వెళ్ళింది. తాజా సమాచారం ప్రకారం వాట్సాప్ కి పోటీగా ఇండియా నుండి మరో కొత్త యాప్ వస్తుంది.

సందేశ్ అనే సోషల్ మెసేజ్ యాప్ ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిసింది. మరికొద్ది రోజుల్లో వాట్సాప్ కి పోటీగా సందేశ్ యాప్ మార్కెట్లోకి రానుందని సమాచారం. ప్రైవసీకి సంబంధించి ప్రతీదీ చాలా పకడ్బందీగా ఉండనుందట. మరి సందేశ్ యాప్ ఎలా ఉంటుందో చూడాలి.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...