తెలుగులో సినిమానే రిలీజ్ కాలేదు.. తమిళంలో అవకాశాలు..

Join Our Community
follow manalokam on social media

క్రితి శెట్టి.. మెగా ఫ్యామిలీ నుండి పరిచయం అవుతున్న పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన థియేటర్లలోకి రానుంది. అయితే సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే క్రితిశెట్టికి అవకాశాలు వరదగా వస్తున్నాయి. ఇప్పటికే నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. తాజా సమాచారం ప్రకారం మరో రెండు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చేలా ఉందని తెలుస్తుంది. నాగశౌర్య హీరోగా నటించనున్న సినిమాలోక్రితిశెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట.

తెలుగులోనే కాకుండా అటు తమిళంలో సూర్య హీరోగా రూపొందే సినిమాలో క్రితిశెట్టిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఉప్పెన సినిమా రిలీజ్ కాకముందే క్రితిశెట్టికి అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇక సినిమా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ అయ్యేలా ఉంది. మొత్తానికి మొదటి సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ గా వెలిగిపోతున్న క్రితిశెట్టి కెరీర్, జోరు మీదుండేలా ఉంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....