ఆస్ట్రేలియా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని చేధించే పనిలో భాగంగా ఇండియా మొదటి పది ఓవర్లు మాత్రమే ఫేవరెట్ గా కనిపించింది. ఆ తర్వాత వరుసగా సుందర్ (18), రోహిత్ శర్మ (81), కోహ్లీ (56), రాహుల్ (26) మరియు సూర్య కుమార్ యాదవ్ వికెట్లను వరుస విరామాల్లో కోల్పోయి నెమ్మదిగా ఓటమి అంచుల వరకు చేరుకుంది. క్రీజులో కుదురుకున్నారు కదా అనుకునే లోపు వికెట్ ఇచ్చేసి ఇండియాను తీవ్ర కష్టాల్లోకి నెట్టేశారు.. ప్రస్తుతం ఇండియా నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి ఓటమికి అతి దగ్గరలో ఉంది. క్రీజులో శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఉండగా.. రవీంద్ర జడేజా ఎంతవరకు ఇండియాను గట్టెక్కించగలడు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా 12 ఓవర్ లలో 118 పరుగులు చేయాల్సి ఉంది.. ఓవర్ కు పరుగుల చొప్పున చేయాల్సి ఉండగా, వికెట్లు లేకపోవడమే ఇండియాకు పెద్ద సమస్యగా మారింది.
మరి శ్రేయాస్ అయ్యర్ మరియు జడేజాలు ఏమైనా మ్యాజిక్ చేసి ఆస్ట్రేలియా పై విజయాన్ని సాధిస్తారా చూడాలి.