అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై భారత్ 160 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. 294/7 ఓవర్ నైట్ స్కోరుతో భారత్ 3వ రోజు తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లు దూకుడగా ఆడుతూ భారత్‌కు భారీ పరుగుల ఆధిక్యం లభించేలా చేశారు.
174 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో సుందర్ 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, అక్షర్ పటేల్ 97 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత్ ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 వికెట్లు తీయగా, జేమ్స్ ఆండర్సన్ 3 వికెట్లు తీశాడు. జాక్ లీచ్ 2 వికెట్లు పడగొట్టాడు.