భారత్- నేపాల్ మధ్య మళ్లీ మ్యాప్ గొడవ మొదలు

-

కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్, గుంజి ప్రాంతాలను అక్రమంగా సందర్శించకుండా తమ దేశ పౌరులను నియంత్రించాలని భారత్​ ఆదేశించినట్లు నేపాల్​లోని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. ఈ భూభాగాల్లోకి అక్రమంగా ప్రవేశించాలని కొన్ని బృందాలు ప్రయత్నిస్తున్నాయని భారత అధికారి నేపాల్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించాయి. ఈ పరిణామాలు ఇరుదేశాల మధ్య సమస్యలు సృష్టిస్తాయని లేఖలో భారత అధికారి పేర్కొన్నట్లు చెప్పుకొచ్చాయి.
ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ జిల్లా దర్చులా డిప్యూటీ జిల్లా కమిషనర్ అనిల్ శుక్లా ఈ మేరకు జులై 14న లేఖ రాసినట్లు హిమాలయన్ టైమ్స్ పేర్కొంది. అలాంటి చొరబాట్ల గురించి సమాచారం అందించాలని శుక్లా కోరినట్లు తెలిపింది.

Bharath

అయితే లింపియాధురా, కాలాపానీ, గుంజి ప్రాంతాలు నేపాల్​కు చెందినవే కాబట్టి తమ పౌరులు తిరగడం సాధారణమేనని ఆ దేశ అధికారులు పేర్కొన్నట్లు హిమాలయన్ టైమ్స్ రాసుకొచ్చింది. నేపాల్​లోని దర్చులాకు చెందిన అసిస్టెంట్ జిల్లా పాలనాధికారి టెక్ సింగ్ కున్వర్ ఈ మేరకు లేఖ రాసినట్లు తెలిపింది. నేపాల్ హోంశాఖ సూచనతో లేఖను భారత అధికారులకు పంపించినట్లు పోఖారెల్ చెప్పారని పత్రిక స్పష్టం చేసింది.

భారత్​కు చెందిన లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగాలుగా పరిగణిస్తూ నేపాల్ రాజకీయ భౌగోళిక మ్యాప్​ను ఆమోదించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఈ ప్రాంతాలపై వివాదం తలెత్తింది. నేపాల్ చర్యను భారత్ ఖండించింది. కృత్రిమంగా చేసిన మార్పులను ఆమోదించేది లేదని తేల్చిచెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news